Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులకు అటవీ హక్కుల చట్టం 2005 ప్రకారం పోడు పట్టా అందజేస్తారని ఇల్లందు నియోజక వర్గం శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ తెలిపారు. మంగళవారం మండలంలోని 9వమైల్ తండా గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక సర్పంచ్ జరుపుల బిచ్చా నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అధికారులు అర్హులకు పట్టా కల్పిస్తారని, దళారులను నమ్మొద్దని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.వి.శ్రీనివాసరావు, ఎంపీడీవో బాలరాజు, ఎంపీపీ భూక్యా రాధ, ఎంపీఓ గాంధీ, ఫారెస్ట్ డీఆర్వో కృష్ణ, సీఐ బానోతు రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మేర్ల వరప్రసాద్, నాయకులు బిక్షం, ఫుల్సింగ్ నాయక్, శివరృష్ణ తదితరులు పాల్గొన్నారు.