Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మరికొందరి ఆర్థిక సహాయాలు
నవతెలంగాణ-చర్ల
కోయగూడెం నుండి వారణాసిలో ఐఐటీ ఇనిస్టిట్యూట్కి సెలెక్ట్ అయిన నిరుపేద గిరిజన విద్యార్థి కారం శ్రీలతను పలువురు అభినందించడంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. చర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి.అశోక్ ఏజెన్సీ మనీ పూసకు రూ.5000 ఆర్థిక సహాయం అందించి అభినందించారు. అదేవిధంగా ఇక్కడ విధులు నిర్వహించిన రాఘవ రెడ్డి అనే తహసీల్దార్ రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. పలువురు ప్రముఖులతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంగళవారం ఏజెన్సీ సరస్వతి పుత్రికను స్వయంగా కలిసి అభినందించారు. సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కారం శ్రీలత కలిసిన సంగతి విధితమే. శ్రీలత ప్రయాణానికి కావలసిన ఖర్చులను తానే స్వయంగా భరిస్తానని బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే తక్షణ సహాయంగా టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నక్కినబోర ుున శ్రీనివాసరావు రూ.5000, రిటైర్డ్ టీచర్ దొడ్డి తాతారావు రూ.1000 మొత్తం రూ.6000 నగదును అందచేసారు. ఈ కార్యక్రమంలో యోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, మండల అధ్యక్షకార్యదర్సులు సోయం రాజారావు, శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు లంకరాజు, సర్పంచ్లు కృష్ణార్జున రావు, కోరం నాగేంద్ర, కేశవాపురం ఉప సర్పంచ్ మురళి, ఆత్మ కమిటీ చైర్మన్ రామచంద్రరావు, సీనియర్ నాయకులు అరవింద్ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.