Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ సహకార సంఘం ద్వారా రైతుల వద్ద నుండి వానాకాలం ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు సిద్ధం చేశామని డీసీఎమ్ఎస్ వైస్ చైర్మెన్ అండ్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించి, మాట్లాడారు. మండల పరిధిలో ప్రభాతనగర్ (రెడ్డిగూడెం), కారేగట్టు, సోములగూడెం, నాగారం, దంతెలబోరు, పాల్వంచలో మొత్తం 6 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులు తమ పంట పొలాల వద్దే తూర్పార పట్టుకొని, 17 శాతంకు లోబడి తేమశాతంతో కేంద్రానికి ధాన్యం తీసుకురావాలని అన్నారు. కేంద్రానికి వచ్చేప్పుడు వ్యవసాయ శాఖాధికారుల ద్వారా కూపన్, భూమికి సంబంధించిన పహాణి, పాసుబుక్ల ద్వారా ధృవీకరణ పత్రం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మెన్ కాంపల్లి కనకేశ్, సహకార బ్యాంకు మేనేజర్ ఎస్.వసుమతి, డైరెక్టర్లు బుడగం రామ మోహన్ రావు, కనగాల నారాయణరావు, సామ జనార్ధన రెడ్డి, చౌగాని పాపారావు, జరబన సీతారాంబాబు, మైనేని వెంకటేశ్వరావు (బాబు), భూక్యా కిషన్, ఎర్రంశెట్టి మధుసూదన్ రావు, బర్ల వెంకటరమణ, సొసైటీ సీఈఓ జి.లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.