Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-పాల్వంచ
దోపిడి లేని సమాజంను నిర్మించడమే కమ్యూనిస్టుల లక్ష్యమని నిరుపేదలకు అన్ని సౌకర్యాలు అందేవరకు పోరాడుతాం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పాల్వంచ పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యులు అగజ్ఞలరి సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ విశిష్టత శాఖల ఫంక్షనింగ్ క్లాసులు బోధించారు. ప్రిన్సిపాల్‌గా పార్టీ పట్టణ కార్యదర్శి దొడ్డ రవికుమార్ ఈ శిక్షణా తరగతుల్లో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు ఎం.జ్యోతి, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మెరుగు ముత్తయ్య, గుడేపూరి రాజు సత్య, వాణి, రహీం, నిరంజన్ పార్టీ శాఖా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.