Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అన్నార్తుల గుండెల్లో రారాజు
అ కన్నీటి బాధలు తూడ్చే మారాజు
అ పేదల పెదవులపై చిరునవ్వే
బుద్దరాజు నరసింహారాజు
(నవీన్‌బాబు)
నవతెలంగాణ-మణుగూరు
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం, ఆయన ప్రతిరూపం. ఆయన సేవలు అన్యన్య సామాన్య మైనవి. అన్నార్తుల కన్నీటి బాధలు ఆయన హృదయాన్ని తట్టిలేపుతాయి. నేటి యువతరానికి ఆదర్శం. చిన్న వయస్సులోనే పినపాక నియోజకవర్గ ప్రజల మన్ననలు, మనస్సు గెలిచిన రారాజు బుద్దరాజు నరసింహారాజు (నవీన్‌బాబు). ఆయన ఆర్మి స్థాపించి నేటికి సంవత్సరం పూర్తి అయింది. సంవత్సర కాలంలో ప్రతి మండలం, ప్రతి గ్రామంలో, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఆయన ఆర్ధిక సేవలు అందించారు. చదువుకు దూరం అవుతున్నా పేదింటి పిల్లలకు అన్నగా ఫోన్ చేసి ఆర్థిక సహాయం అందజేశారు. దిక్కు లేని వారికి నేనున్నాను అంటూ, ఆర్థిక సహాయంతో పాటు అన్నిరకాల అండగా ఉండే మనస్సున్న యువకిరణం. నేటి యువతరానికి ఐకాన్‌గా అందరి మనస్సు దోచుకున్నా, అన్నార్తుల గుండెల్లో గూడు కట్టుకున్నా రారాజు నవీన్‌బాబు. తన తాత 50 ఎకరాల పొలాన్ని సింగరేణిలో కోల్పోగా పోలానికి బదులు నష్టపరిహారంగా పేదలకు ఉద్యోగాలు ఇప్పించి ఆదర్శంగా నిలిచిన రాజకీయ విశ్లేషకుడు. ఆయన అడుగుజాడల్లో తాతకు తగ్గ మనవడిగా జీవితకాలం బాధపడే వారికి సరుకులు, డబ్బులు అందిస్తున్నారు. సంవత్సర కాలంలో రూ.కోటి 30 లక్షలు అందించి ప్రజల గుండెల్లో నిలిచిన యూత్ ఐకాన్ నవీన్‌బాబు. అనా రోగ్యంతో బాధపడుతున్న వారికి, చదువుకు దూరంగా ఉన్న పిల్లలకు, ఆదివా సులకు, దళితులకు ఆయన చేయూతనిచ్చి మీకు అండగా నేనున్నాను అం టూ కన్నీటి బాధలు తూడ్చే మారాజుగా మారారు. బాధతో బాధపడుతున్న ప్రతి పేదవాడి పేదవులపై చిరునవ్వై తనదైన శైలిలో ప్రజల మనస్సు దోచుకున్న బుద్దరాజు నరసింహారాజు (నవీన్‌బాబు).
మరిన్ని సేవలతో అగ్రభాగంలో నిలవాలని మహిళలు, ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు కోరుకుం టున్నారు. నవీన్‌బాబు ఆర్మీ సేవలు మరింత విస్తరించాలని, యువకులు ముందుకు రావాలని ఆయన బాటలో నడవాలని ప్రజలు కోరుకుంటు న్నారు.