Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మూడేండ్లవుతున్నా అసంపూర్తిగానే
పేదల గృహాలు
అ సొంతింటి కోసం ఎదురుచూస్తున్న
లబ్దిదారులు
అ పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-ములకలపల్లి
తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తోంది. కానీ ములకలపల్లి మండలంలో మాత్రం పేదల కల రవేరడంలేదు. దీనికి కారణంగా మూ డేండ్లు కావస్తున్నా నిరుపేదలకు నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నోచుకోక అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. మండలంలోని తాళ్లపాయ రింగిరెడ్డిపల్లి పంచాయతీల్లో పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల దుస్థితి ఇది.
మండల పరిధిలోని తాళ్లపాయ పంచాయతీలో 2018లో 20 డబుల్ ఇండ్లను, రింగిరెడ్డిపల్లిలో 2019లో మరో 20 ఇండ్లను నిర్మించేందుకు పనులు చేపట్టారు. అయితే నేటికి మూడేండ్లు కావస్తున్నా అవి అసంపూర్తిగానే ఉండటంతో ఇల్లు లేని నిరుపేదలు తమ సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురుచూస్తూ మరోవైపు కాంట్రాక్టర్, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం డబుల్ బెడూం ఇండ్లు నిర్మిస్తున్నప్పటికీ సదరు కాంట్రాక్టర్లు మాత్రం ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేయకుండా సగంలోనే వదిలేయడంతో ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఇండ్ల చుట్టూ పొదలు, పిచ్చిచెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కనీసం సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవాడం లేదంటూ ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న డబుల్ ఇండ్లు నిర్మాణాలకు ఆశలు అడియాశలుగానే మారాయి. ఇప్పటికైనా వాటిని కేటాయించాలని లబ్దిదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు.