Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జీఎంను వేడుకున్న పగిడేరు గ్రామస్తులు
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఓసీ 2 విస్తరణలో భూములు కోల్పోయినా భూ నిర్వాసితులు జీవనోపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి కల్పించాలని ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్‌ను మంగళవారం పగిడేరు మహిళలు వేడుకున్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఎస్టేట్ అధికారులతో మాట్లాడి తగిన న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ పగిడేరు పంచాయతీ శాంతినగర్‌కు చెందిన దళితులు గత 15 సంవత్సరాల నుండి పోడు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నమన్నారు. ఓసి విస్తరణలో భూములు కోల్పోయినా భూ నిర్వాసితులుగా జీవనోపాధిలేక అర్థిక ఇబ్బందులు పడుతున్న మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జీఎం కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఇంద్రమ్మ, రజిత, ఉప్పలమ్మ, మరియమ్మ, విజయ, సోమలక్ష్మీ, సంతోష, ఇందిరా, కమలమ్మ, జలమ్మ, నాగమణి, తదితరులు ఉన్నారు.