Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అర్హులైన పోడు రైతులకు భూమి
అ వరి ప్రత్యమ్నాయ పంటలు సాగుచేయాలి
అ జడ్పీ చైర్మెన్, కలెక్టర్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధాన్యం కోనుగోలు కేంద్రాల ద్వారానే వరి ధాన్యం కొనుగోలు జరుగుతుందని, అర్హులైన పోడు రైతులకు భూమి అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వరి ప్రత్యమ్నాయ పంటలు రైతులు సాగుచేయాలని, ఇందుకు గాను జిల్లా వ్యవసాయ శాఖ రైతులల్లో చైతన్యం నింపాలని జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య,్ల కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా స్థాయి సంఘ సమావేశములు నిర్వహించారు. వ్యవసాయ స్థాయి 3వ కమిటీ సమావేశం జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కంచర్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. వ్యవసాయ శాఖలో ధాన్యం సేకరణ గురించి తెలిపారు. గిట్టుబాటు ధర పొందేందుకు రైతులు ధాన్యం శుభ్రం చేసి, ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకు రావాలని కోరారు. వరి ప్రత్యామ్నయ పంటలైన పప్పు ధాన్యాలు, పామాయిల్, ఇతర మార్కెట్లో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు వేయుటకుగాను రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పోడు భూములపై మాట్లాడుతూ మొదటి దశలో చాలా మంది లబ్దిదారులు అవగాహన లోపం వలన వారు పోడు పట్టాలు పొందలేక పోయారని, అందువలన జిల్లాలో 8 నవంబర్ నుండి 10 నవంబర్ 2021 వరకు గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించడము జరుగుతున్నదని తెలిపారు. గ్రామ స్థాయిలలో కమిటీల ఏర్పాటు చేసి వారికి లబ్ది చేకుర్చుట జరుగుతున్నదని తెలియజేసారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ భూమి అందజేసే విధంగా ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ మెరుగు విద్యాలత, భూక్య కళావతి, లావుడ్యా బిందు చౌహాన్, కొనగండ్ల వెంకటరెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.