Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 8వ తేదీ సోమవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టు చేయడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఖండించింది. మంగళవారం జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సండ్ర భూపేందర్ బుర్ర వీరభద్రం మాట్లాడారు. విద్యారంగ సమస్యలు, సంక్షేమ హాస్టల్ సమస్యలపై పోరాడే విద్యార్థులపై పోలీసుల నిర్బంధాన్ని ప్రజాస్వామిక వాదులు ఖండించాలన్నారు. కొత్తగూడెంలో సమస్యల పరిష్కారం కోసం పోరాడే విద్యార్థులను పోలీసులు బెదిరించి చెల్లాచెదురు చేయడం, విద్యార్థుల కళాశాలలకు ఫోన్లు చేసి యాజమాన్యాన్ని బెదిరించడం అంటే పాలకవర్గాల కనుసన్నల్లో పనిచేసే పోలీసులకు సమాజ తిరోగామి శక్తులుగా ముద్రపడే అవకాశం ఉందని సూచించారు. ఎడారిలో పరిమళాలు వెదజల్లే పుష్పాలు పుష్పింపజేసే శక్తి, ఇసుక తిన్నెలలో పంటసిరులు తీయగలిగే శక్తి మాకుందనీ విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ఊరుకోం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కొట్టే జిల్లా కమిటీ సభ్యులు రామటెంకి శ్రీను తదితరులు పాల్గొన్నారు.