Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చర్ల పీఏసీఎస్ అధ్యక్షులు పరుచూరి
నవతెలంగాణ-చర్ల
వ్యవసాయ సహకార పరపతి సంఘం చర్ల ద్వారా వానాకాలం (ఖరీఫ్ 2021-22 సం||) ధాన్యము కొనుగోలు చేయుటకు గాను, ప్రభుత్వము 5 కేంద్రాలు మంజూరు చేసింది. 1.లింగాపురం, 2.జి.పి.పల్లి, 3.చీమలపాడు, 4.ఉప్పరగూడెం, 5.దోసిళ్ళపల్లి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు పండించిన పంటను అమ్ముకొని, మద్దతు ధర పొందగలరని పీఏసీఎస్ అధ్యక్షులు పరుచూరి రవి బాబు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుండి అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు, రైతులు ఎవరూ అదైర్యపడవద్దని తెలిపారు. మధ్యవర్తులకు అమ్ముకొని మోసపోవద్దని చూసించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో నిబంధనలకు లోబడి ధాన్యము అమ్ముకొని మద్దతు ధర పొందవలసిందిగా చర్ల పీఏసీఎస్ సీఈఓఎస్డీ జిలాని ప్రకటనలో రైతులకు తెలియజేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ 2021-22 సం|| నకు ప్రభుత్వము వారు నిర్ణయించిన వరి ధాన్యము కనీస 'ఎ' గ్రేడ్ రకము రూ.1960లు మద్దతు ధర క్వింటాల్కి, సాధారణ రకము రూ.1940లు రైతులు పండించిన పంటను తమ పొలములోనే ఆరబెట్టుకొని ప్యాడీ క్లీనర్ ద్వారా ధాన్యము శుభ్రపరుకోవాలని తెలిపారు. రైతులు సంబంధిత ఏఈఓ నుండి టోకెన్ తీసుకొని రావాలని తెలిపారు. టోకెన్ ప్రకారం కాటాలు వేయనున్నట్టు తెలిపారు. సంబంధిత కేంద్రముల పీపీసీ ఇన్చార్జ్లు రైతులకు పొలము వద్ద ధాన్యము నింపుకొని వచ్చుటకు గాను, గోనె సంచులు ఇవ్వరు. కావున రైతులు గమనించగలరని చూసించారు. రైతులు కొనుగోలు కేంద్రమునకు ధాన్యము తీసుకొని వచ్చి అమ్మకము జరపవలెనని. పైన తెలుపబడిన నిబంధనలు అనుసరించి రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల యందు అమ్ముకొని ప్రభుత్వ మద్ధతు ధర పొందగలరని వారు తెలియజేసారు.