Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసనలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను కొనుగోలు చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా పలు సెంటర్లో ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పలు చోట్ల ధర్నాలు నిర్వహించారు. మారాయిగూడెం, అంజుబాక, నడికుడి గ్రామాలలో జరిగిన ధర్నా కార్యక్రమంలో మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యురాలు కొర్సా చిలకమ్మ, వ్యవశాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్యలు మాట్లాడారు. ధాన్యం క్వింటాళకు రూ.2 వేల 500, పత్తి క్వింటాకు రూ.10 వేల చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలన్నారు. ధర్నా కార్యక్రమంలో వ్యకాస మండల అధ్యక్షులు ఉబ్బా సంపత్, మాజీ ఎంపీటీసీ చిన్నారావు, నాయకులు వెంకటేశ్వర్లు, భూపతి, కృష్ణమూర్తి, సీతమ్మ, వెంకటస్వామి పాల్గొన్నారు.
ములకలపల్లి : రైతులు పంటలను కోసి సిద్ధంగా ఉంచారని ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర రూ.2500 ప్రకటించాలని, పెంచిన నిత్యావసర ధరలు తక్షణమే తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయ కులు శ్రీరాములు, లక్ష్మీనర్సయ్య, అమల, వెంకటేశ్వరు, నాగరాజు, కోసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : పండిన పంటలోని ప్రతి గింజ కొనుగోలు చేస్తామనే హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని సీపీఐ(ఎం) మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ తహసీల్దార్ కిషోర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం రైతు సంఘం నాయకులు తాళ్లూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల కార్యదర్శి అబ్దుల్ నబి, సీనియర్ నేత దేవులపల్లి యాకయ్య మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో రాందాస్, రమేష్, రాజు, సురేష్, మహేష్, రహీమ్, మున్న, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మిదేవిపల్లి : గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని మండలంలో సీపీఐ(ఎం), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం), ప్రజా సంఘాల నాయకులు జాటోత్ కృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని సుమారు రూ.6 కోట్లు రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలన్నారు. అదేవిదంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఉప్పన పెళ్లి నాగేశ్వరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎం.నాగేశ్వరరావు, మల్లయ్య, మోహన్ రావు, సురేష్, సర్పంచ్ రత్ని బట్టు వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.