Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్
అ వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఇల్లందు
గ్రామాలు, పట్టణాల్లో చిల్లర కాంటాలు పెట్టి రైతు పంటలను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్ అన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు పాటలు నిర్వహించారు. పత్తి క్వింటాకు రూ.8,300, ఆర్ఆర్ రకం వడ్లు రూ.2001, మొక్కజొన్న 1,800 ఆసాములు పాడుకొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. రైతులు పండించుకున్న పంటకు ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలకే ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బర్మావత్ లాల్ సింగ్, సెక్రెటరీ అలీం, వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.