Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఎన్జీఓఎస్ అధ్యక్షులు అమరనేని రామారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని జిల్లా టిఎన్జీఓఎస్ అధ్యక్షులు అమరనేని రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ హాల్లో టీఎన్జీవో కొత్తగూడెం తాలుకా అధ్యక్ష, కార్యదర్శులు విజయలక్ష్మి జనిమియా ఆధ్వర్యంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు అమరనేని రామారావు, కార్యదర్శి కంచర్ల సాయి భార్గవ్ చైతన్య ఉద్యోగులు ఎదురుకుంటున్న పలు సమస్యలను సుదీర్గంగా చర్చించి పలు తీర్మానాలను చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒకశాతం చందాతో ఆరోగ్య కార్డులు మంజూరు చేస్తూ ఉద్యోగులందరికీ కార్పొరేట్ వైద్యాన్ని అందజేయాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డిఏ లను వెంటనే మంజూరు చేయాలని, ఉద్యోగులకు, పెన్షనర్ లకు జనవరి 2020, జూలై 2020, జనవరి 2021, జులై-2021 నాలుగు పెండింగ్ డిఏ లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాలలో జనాభా ప్రాతిపదికన క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయాలని, నూతన జిల్లా కేంద్రాలలో అన్ని ప్రభుత్వ శాఖల్లో జనాభా ప్రాతిపదికన పోస్టులు మంజూరు చేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆధాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలి. ఉద్యోగుల ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని, ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ చేబట్టాలని, తెలంగాణ ఎన్జీవోల సంఘానికి అనుబంధంగా రెవెన్యూ శాఖలో తెలంగాణ ఎన్టీఓ రెవెన్యూ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి సమావేశం తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు సిహెచ్.రామనర్సయ్య, కోశాధికారి ఇమ్రాన్ పాషా, ఏడు యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.