Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కేటాయించడంలో, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కపెడుతున్నాయని తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ ఎస్టి సెల్ ఉపాధ్యక్షు లు కొమరం దామోదర రావు విమర్శించారు. బుధవారం టీ.డీ.పి పార్టీ మండల కమిటీ సమావేశం స్థానిక మార్కెట్ యార్డు వద్ద యడారి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆటలు ఆడుతున్నాయని, రబీలో వరివేయరాదని, ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా పంటవేసినయెడల ప్రభుత్వం కొనుగోలు చేయదని, రైతులు ఆరు తడి పంటలు వేసుకోవాలని చెప్పడం సరికాదన్నారు. గత సీజన్లో వరి సన్నరకాలు మాత్రమే వేయాలని, దొడ్డు రకాలు వేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదని రైతులను తికమక పెట్టారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు యుండాలి సత్యనారాయణ, రేగిపళ్ళు సుధాకర్, మండల కార్యదర్శి ఎన్. మోహన్ కృష్ణ, యడ్ల సత్తిబాబు, నాగయ్య, చినబాబు పాల్గొన్నారు.