Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దేవీప్రసన్న
నవతెలంగాణ-ములకలపల్లి
తెలంగాణ ప్రభుత్వం మొన్నటివరకు వరిసాగు చేయొద్దని.. వరి సాగు చేస్తే రైతులకు ఉరి అని మాట్లాడి ఇప్పుడు వరిసాగు చేసుకోండి మేము కొంటామని చెబుతుందని జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న ఎద్దేవా చేశారు. బుధవారం మండల పరిధిలోని ఆనందపురంలో గుర్రం జయసుధ నివాసంలో మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బూరుగుపల్లి పద్మశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న దేవీ ప్రసన్న మాట్లాడుతూ.. ఇటీవల హుజారాబాద్ ఉప ఎన్నికలో వరిసాగు చేసుకోండి మేము కొంటామని ఓడాక మళ్లీ పాత పాట పాడుతున్నారని మండిపడ్డారు. ఏడేళ్లు పదవీకాలంలో ప్రధానంగా విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులను గాలికొదిలేసిన కేసీఆర్ మద్యం అమ్మకాలు, టెండర్లపై ప్రేమ కురిపిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీసీసీ మెంబరు, జెడ్పీటీసీ సున్నం నాగమణి, మండల మైనార్టీ అధ్యక్షులు అంజమ్, నాయకులు తేజావత్ మంజుల, గుర్రం కృష్ణమూర్తి, ఈ అశోక్, పర్సా ముత్తమ్మ పాల్గొన్నారు.