Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. తొలుత కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్‌లో ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ మాట్లాడుతూ భగీరథ కార్మికులకు పెండింగ్ వేతనాలు, పిఎఫ్ సక్రమంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులుగా 600 మంది పని చేస్తున్నారని తెలిపారు. కార్మికుల సమస్యలపై కలెక్టర్ దృష్టి పెట్టాలన్నారు. మిషన్ భగీరథ అధికారులు మిషన్ భగీరథ కార్మికులతో కలెక్టర్ సారధ్యంలో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మికులు అన్నం వెంకయ్య, పాపగంటి రాంబాబు, గోడ్ల నరసింహారావు, ఆర్ పిచ్చయ్య, మధుసూదన్ రెడ్డి, స్వామి దాసు తదితరులు పాల్గొన్నారు