Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరాటౌన్
విద్యార్థుల సగటు హాజరు ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ణయించి ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పెట్టే ఆలోచనను విరమించుకోవాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం మండల 8వ మహాసభ వైరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా షేక్ రంజాన్ మాట్లాడుతూ విద్యార్థుల నమోదు ఆధారంగా విద్యావలంటీర్లను నియమించాలని, తక్షణమే రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు అన్నింటిని టి.ఆర్.టి ద్వారా నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పెరిగిన విద్యార్థుల నమోదుకు తగినట్లుగా పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని, తక్షణమే బదిలీలు, ప్రమోషన్లు నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో స్వచ్ఛ కార్మికులను నియమించక పోవడం వలన పాఠశాలలో పరిశుభ్రత లోపించిందని, తక్షణమే పాఠశాలలో స్వచ్ఛ కార్మికులను నియమించాలన్నారు. అనంతరం 2021-22 సంవత్సరానికి గాను నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. యుటిఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులుగా బి.శ్రీనివాస్‌రెడ్డి, డి.రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎం.భారతి, టి.సైదులు, కోశాధికారిగా జి.రామకృష్ణ, కార్యదర్శులుగా వి.భాస్కర్‌రావు, షేక్.జరీనా, ఎస్.వెంకటేశ్వర రావు, వై.నరేష్ కుమార్, ప్రత్యేక ఆహ్వానితులుగా పి.విద్యాసాగర్, టి.హనుమంతరావు ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా షేక్ సర్వర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
.