Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ- కల్లూరు
చండ్రుపట్ల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు తన్నీరు కృష్ణార్జునరావు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు కరెంటు, మంచినీటి సౌకర్యం లేక లబ్ధిదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మరుగుదొడ్ల నుండి నీరు బయటకు పోవడానికి ఎలాంటి నీటి పైపులు లేవన్నారు. అదే విధంగా ఫ్లోరింగ్ మొత్తం పాడైపోతుందన్నారు. కొన్ని ఇళ్లలో ప్లోరింగ్ కూడా సరిగ్గా చేయలేదన్నారు. కిటికీలు బిగించలేదన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళటానికి సరైన దారి లేదన్నారు. సెప్టిక్ ట్యాంకులు సరిగా లేవు అన్నారు. కొన్ని ట్యాంకులకు మూలు కూడా లేవన్నారు. మరుగుదొడ్ల నుండి సెప్టిక్ ట్యాంక్ పైపులు కూడా కలవలేదన్నారు. ఈవిధంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు వెంటనే మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసారు. అనంతరం సూపరింటెండెంట్ శర్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు, ఐద్వా మండల కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, గొర్రెలు మేకల సంఘం మండల కార్యదర్శి బట్టు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.