Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి
నవ తెలంగాణ- ఖమ్మంరూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ఉన్న సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎస్ మండల మహాసభను గొల్లగూడెంలోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నతపాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చావా రవి మాట్లాడారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా సర్వీస్ రూల్స్ విడుదలచేసి పదోన్నతులు,బదిలీలు చేపట్టాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో వెంటనే విద్యావాలంటీర్ల నియామకం చేపట్టాలన్నారు. పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలన్నారు. నవంబర్ 13న జరిగే జిల్లా కమిటీ విస్తత సమావేశాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు షేక్ మహబూబ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు డిఎస్. నాగేశ్వరరావు, ఏడునూతల రవి కుమార్, మందడపు శ్రీనివాసరావు, షమీ, రోజా, ఎం.ప్రసాద్‌రావు, నారాయణ, మహేశ్, శేషగిరి, బాలస్వామి, నెహ్రు పాల్గొన్నారు.