Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమలాయపాలెం : ధాన్యం కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొమ్ముశ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి పిండిప్రోలులో సిపిఎం గ్రామ శాఖ ఆద్వర్యంలో కొవ్వొత్తు లతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం సీని యర్ నాయకులు దొండేటి ఆనందరావు, పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు పద్మనాభుల సుధాకర్, శాఖ కార్యదర్శి పప్పుల ఉపేందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కాకరవాయి సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో వరి గంటలతో బుధవారం నిరసన కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు అంగిరేకుల నరసయ్య, మండల కమిటీ సభ్యులు కొత్తపల్లి వెంకన్న, గ్రామ శాఖ కార్యదర్శి గుండాల వెంకన్న, పార్టీ సభ్యులు వీరబోయిన నాగయ్య, సురభి, సతీష్, పెనుగొండ గోవిందయ్య పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : యాసంగిలో వరి పంటకు అనుమతిచ్చి పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అన్నారు.పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ సీపీఎం గ్రామ శాఖల, సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని గుదిమళ్ల, తెల్దారుపల్లి, ముత్తగూడెం, ఎం.వెంకటాయపాలెం గ్రామాల్లో బుధవారం నిరసన చేపట్టారు. మోడీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పెరుమల్లపల్లి మోహన్‌రావు, పొన్నెకంటి సంగయ్య, తాటి వెంకటేశ్వర్లు, శాఖ కార్యదర్శి ఏపూరి వర కుమార్, రంజాన్ పాషా, నగేష్, పట్టాభి, బీరయ్య, నారాయణ, రామనాథం, ఏపూరి నాగేశ్వరరావు, సిరివాడ మల్లికార్జున్, సైదులు, రమేష్, సాయి, ఉమామహేశ్వరరావు, సాల్వే వెంకటేశ్వర్లు, జింక బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాయల వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మచ్చా వీరయ్య భవనంలో రైతుసంఘం మండల కమిటీ సమావేశం ఆ సంఘం మండల అధ్యక్షులు కందుల భాస్కర్‌రావు అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల12న ఖమ్మం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో మండలంలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఆందోళనను జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్, సిపిఐ (ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, రైతుసంఘం మండల కార్యదర్శి కోలేటి ఉపేందర్, నాయకులు యండ్రాపల్లి రవికుమార్, మర్లపాటి కోటేశ్వరరావు, మందరపు వెంకన్న, పుచ్చకాయల నాసరయ్య, రమేష్, చావా శ్రీనివాసరావు, సామినేని రామారావు తదితరులు పాల్గొన్నారు.
మధిర : వేసంగిలో వరి పంట వేయొద్దనిఅనడం కేంద్ర ప్రభుత్వంకి సిగ్గుచేటని మధిర భగత్ సింగ్ సెంటర్ నందు కేంద్ర ప్రభుత్వా దిష్టిబొమ్మను సిపిఎం ఆధ్వర్యంలో దగ్ధం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి మండవ ఫణేంద్ర కుమారి, టౌన్ కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, తేలప్రోలు రాధాకృష్ణ, పడకంటి మురళి, ఫాతిమా బేగం, పెంటి వెంకట్రావు, యన్.సాంబశివరావు, వడ్రాణపు మధు, చింతల నాగరాజు, పేరు స్వామి నాయకులు పాల్గొన్నారు.
బోనకల్ :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల చట్టాలపై దొంగాట ఆడుతున్నాయని తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు కొమ్మినేని నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు దొండపాటి నాగేశ్వరరావువి మర్శించారు. నారాయణపురం, రామాపురం, రావి నూతల, ముష్టికుంట్ల, పెద్ద బీరవల్లి, గార్లపాడు గ్రామా లలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ చట్టాలను నిరసిస్తూ మంగళవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఆయా గ్రామాలలో ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో రైతులు ముక్కపాటి అప్పారావు, తాత వెంకయ్య, తాతా లక్ష్మీనారాయణ, తాత వీరయ్య, ముక్కపాటి నాగేశ్వరరావు, పెద్దపోలు కోటేశ్వరరావు, ఆళ్ల ప్రసాద్, చల్లగొండ రామనర్సయ్య, కందికొండ శ్రీనివాసరావు, బొడ్డుపల్లి నాగ బ్రహ్మం, పిల్లలమర్రి నాగేశ్వరరావు, బొడ్డుపల్లి కోటేశ్వరరావు, పోతినేని నరసింహారావు, కూచిపూడి మురళీకష్ణ పొన్నం ఆంజనేయులు, కొంగర భూషయ్య, జోనిబోయిన గురవయ్య పాల్గొన్నారు.
చిరునోములలో రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కిలారు సురేష్ నాయకులు నిమ్మ తోట ఖానా, నిమ్మల రామారావు, ముంగి వెంకన్న, అల్లిక రంగయ్య, సావిటి వెంకన్న, నీలకంఠం రాము, గొల్ల కోటేశ్వరరావు, రేగళ్ల చిన్ని, మెట్టెల కృష్ణ, సత్యాల వెంకట రామయ్య పాల్గొన్నారు.
వైరాటౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అవగాహన అంగీకారం తోనే వరి పంట సాగుపై ఆంక్షలు విధించాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అన్నారు. బుధవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగరంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, వరి పంట సాగుపై ప్రభుత్వ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొంతు సమత, బోడపట్ల రవీందర్, కురకుంట్ల శ్రీనివాసరావు, పారుపల్లి చంద్రశేఖర్ బాబు, మందడపు రామారావు, నర్వనేని ఆదిలక్ష్మి, తోట కష్ణవేణి, నక్కా రాంబాబు, వడ్లమూడి మధు, బందెల్ పౌలు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.