Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ మోడీ..?
డీవైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షులు విజరు కుమార్
నవతెలంగాణ-ఖమ్మం
బిజెపి అధికారంలోకి వచ్చాక ఏడేళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరం అయిందని, మోడీ నిరుద్యోగులకు ఇస్తానన్న సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని డివైయఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షుడు ఐత విజరు కుమార్ ప్రశ్నించారు. బుధవారం ఖమ్మంలోని మంచికంటి భవన్లో డివైయఫ్ఐ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అధ్యక్షతన జరిగింది.సమావేశానికి తొలుత ప్రారంభ సూచికిగా సంఘం జెండాను రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ ఆవిష్కరించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నపటికీ బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా అప్పచెప్పడంతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ద్వంసం చేయాలనే కుట్ర బిజెపి ప్రభుత్వం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రభుత్వ రంగాలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకకుండా పోతున్నాయని అన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనిగంటి వెంకటేష్, రాష్ట్ర నాయకులు రోష్ని ఖాన్, రవి నాయక్, షేక్ బసీరుద్దీన్, లిక్కి బాలరాజు, రాథోడ్ సంతోష్, జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్, బోనకల్ మండల ఎంపీపీ సౌభాగ్య, జిల్లా నాయకులు శీలం వీరబాబు, గుమ్మ ముత్తరావు, కణతాల వెంకటేశ్వర్లు, దిండు. మంగపతి, ఇంట్లురి అశోక్, కూరపాటి శ్రీను, రావులపాటి నాగరాజు, షేక్ సైదులు, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.