Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
పీఆర్సీ బకాయిలు పెన్షనర్లకు ఒకే వాయిదాలో చెల్లించాలని, నాలుగు విడుతల డీఆర్లు వెంటనే ప్రకటించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పిఆర్సి ప్రయోజనాలు 01జూలై 2018 నుండి అందరికీ అమలు చేయాలని, పెండింగ్ జిడిలను వెంటనే విడుదల చేయాలని, ఈహెచ్ ఎస్ స్కీంను ప్రస్తుతం పద్ధతిలో మరింత మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన వారికి పూర్తి పెన్షన్ చెల్లించాలని, ఎనిమిది సంవత్సరాల సర్వీస్ వెయిటేజీ ఇవ్వాలన్నారు. 01జూలై 2018 నుండి 31 జనవరి 2021 మధ్య రిటైర్డ్ అయినవారికి గ్రావిటీ లీవెన్ క్లాస్ మెంట్ డిఫరెన్స్ అమలు చేయాలని, రివైజ్డ్ పెన్షన్ ఆర్డర్ ఏజీ కార్యాలయం నుండి త్వరగా విడుదల చేయాలని ఎనామిలిస్ కమిటీని వేసి పిఆర్సిలోని లోపాలను సరి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్.గోపీచంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ నాగేశ్వరరావు, వాసిరెడ్డి మల్లికార్జునరావు, చావ రవి, రాజశేఖర్, కృష్ణమోహన్, వీరబాబు, పిఎన్ రావు, శ్రీ రాములు, పూర్ణచంద్రరావు, ఝాన్సీ, మనో రమాదేవి, మాధవరావు, శ్రీనివాసరావు, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.