Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
జాతీయస్థాయిలో విద్యాప్రమాణాల ప్రస్తుత స్థితిని అంచనావేసి భవిష్యత్ విద్యా ప్రణాళికలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న జాతీయ సర్వేపరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు. బుదవారం హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో జిల్లాస్థాయి పరిశీలకులు ఆర్.పార్వతిరెడ్డి సమక్షంలో నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడుతూ నగరాల్లో, పట్టణ, పల్లె ప్రాంతాల్లో గవర్నమెంట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల విద్యాప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకొను నిమిత్తం, ప్రస్తుతం 3, 5, 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకుగాను జిల్లాలో 180 పాఠశాలలను ఎంపిక చేసి, 180 మంది అబ్జర్వర్లను 224మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ సిబ్బందిని నియమించామన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే సర్వేని ఎన్స్ఈఆర్టి, ఎన్ఐసీలు నిర్వహిస్తుండగా, 733 జిల్లాలను, 38 లక్షలమంది విద్యార్థులను పరిశీలించడం జరుగుతుం దన్నారు. జిల్లాలో ఈ పరీక్షకు ఎంపికైన 180 పాఠశాలల వివరాలను ఆయా ప్రధానోపాధ్యాయులకు పంపించడం జరిగిందన్నారు. నియమించిన సిబ్బంది. 12న ఖచ్చితంగా విధి నిర్వహించాలని, గైర్హాజరైన వారికి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియమించిన సిబ్బంది 12న ఉదయం 7:30 గంటలకు విధులకు కేటాయించబడిన పాఠశాలలో హాజరుకావాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి కో-ఆర్డినేటర్ ఆర్.పార్వతీరెడ్డి, సిబిఓ రాజశేఖర్, బోర్డ్ రిప్రజెంటిన్లు సోనియా అనిల్వర్మ, రోనీథామస్, రీసోర్ట్ సెంటర్ కో-ఆర్డినేటర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.