Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలో జరిగిన నమూనా ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకార మహౌత్సవం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య, సిబిఎస్ఇ బోర్డ్ రిప్రజెంటివ్ సానియా అనిల్వర్మ, ముఖ్య అతిథిగా హాజరై స్కూల్ పీపుల్ లీడర్ కుశాల్ తేజ, హెరీమ్ సెక్రటరిగా అఖిల్ కుమార్, అసిస్టెంట్ స్కూల్ పీపుల్ లీడర్‌గా నయన శ్రేష్ఠచే ప్రమాణ స్వీకారం చేయించారు. అదే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులుగా ఎన్నుకోబడిన అభ్యర్థులచే కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. అసిస్టెంట్ హెరీమ్ సెక్రటరీగా జి.మోక్షజ్ఞ, స్పోర్ట్స్ సెక్రటరీగా నవదీప్, అసిస్టంట్ స్పోర్ట్స్ సెక్రటరి వై.సాయినేహ మరియు కె.గోకుల్, కల్చరల్ సెక్రటరీలుగా కె.సాయిధర్మతేజ, అసిస్టెంట్ కల్చరల్ సెక్రటరీగా శ్రీష, లిటరరీ సెక్రటరీగా సాహర్ష్, అసిస్టెంట్ లిటరరీ సెక్రటరీగా వి.పూజిత, ఎన్విరాన్మెంటల్ సెక్రటరీగా వెంకట్ రామ్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీగా కె.ప్రియ హాసిని, స్పోకెన్ ఇంగ్లీష్ సెక్రటరీ మహిత, అసిస్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ సెక్రటరీ జన్రాజ్ హరికృష్ణ డిసిప్లెస్ సెక్రటరీగా నాగామృత, జె.కార్తిక్లచే కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రిన్సిపల్ పార్వతీరెడ్డిని సిబిఎస్ఇ బోర్డ్ తరపున అభినందించారు. కరస్పాండెంట్ రవిమారుత్ మాట్లాడుతూ విద్యార్ధి నాయకులకు అభినందనలు తెలియజేశారు. మన హక్కుల పట్ల, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అలాగే సామాజిక అంశాల పట్ల జాగరూకతతో ఉండాలని తెలిపారు. ప్రిన్సిపల్ పార్వతీరెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత క్రమశిక్షణ నిజాయితీ, సమయస్పూర్తి, ఇతరులతో కలుపుగోలుతనం గల వ్యక్తులు నాయకులుగా ఉన్న సమాజం అభివృద్ధిని సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్ పి.నాగేశ్వరరావు, ఎం.పి.రాజు, సి.బి.యస్.సి. కో ఆర్డినేటర్ విఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.