Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ వాగబొయిన రామక్క గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర కల్పిస్తూ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ధాన్యంలో తేమ 17 శాతం మించకుండా ఉండాలని, రైతులు ధాన్యాన్ని ఇండ్ల దగ్గరనే ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని పీఏసీఎస్ చైర్మన్ గొగ్గెల రామయ్య చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఎస్కే సంధాని, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఈసం శాంత, గుర్రం రాములు తదితరులు పాల్గొన్నారు.