Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే గనిలో ప్రమాదం జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్ ఆరోపించారు. గురువారం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు నిరసన తెలిపిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీరాంపూర్ 3వ గనిలో ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని జరిగిన ప్రమాదంపై పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యానికి ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ కార్మికులకు రక్షణ కల్పించడంలో లేదన్నారు. శ్రీరాంపూర్ మూడవ గానిలో పైకప్పు కూలిన ప్రమాదానికి యాజమాన్యం బాధ్యతా రాహి త్యమే కారణమని ఆరోపించారు. మృతి చెందిన కార్మికులకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ గంధం మల్లికార్జునరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ గుడివాడ రాజేందర్, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్, నిరంజన్ కుమార్, కౌశిక్, ధనుంజరు తదితరులు పాల్గొన్నారు.