Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మానవత్వాన్ని చాటుకున్నా సింగరేణి యాజమాన్యం
నవతెలంగాణ-మణుగూరు
ఓసి2 డంపర్ ఆపరేటర్ ఎండి రకిబ్ను తొలగించిన యాజా మాన్యం అఖిలపక్ష నాయకుల వినతితో తిరిగి ఉద్యోగానికి తీసుకోని సింగరేణి యాజమాన్యం మానవత్వాన్ని చాటుకున్నారు. గురువారం సింగరేణి జీఎంకు అఖిలపక్ష నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం తొలగించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 18-8-21 తేదీన ఓసి2 డంపర్ ప్రమాదంలో డంపర్ ఆపరేటను ఎండి.రకిబ్ను బాధ్యున్ని చేస్తూ, ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తూ ఈ నెల 9న సింగరేణి యాజమాన్యం రకిబ్కు షీల్డ్ కవర్ అందజేశారు. ఈ సంఘటన బాధాకరమైందని విచారం వ్యక్తం చేశారు. కావాలని ఎవరు ప్రమాదం చేయరని, అనుకోకుండా జరిగిదే ప్రమాదమని అన్నారు. రకిబ్ను ఉద్యోగం నుండి తొలగించడం ద్వారా తమ కుటుంబం కూడా తొలగింపు పర్యావసానాన్ని అనుభవించాల్సి ఉంటుందన్నారు. కుటుంబ అన్యాయం అయిపోతుందన్నారు. రకిబ్ పశ్చాత్తాప పడడం ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో ఆందోళన పడుతుందన్నారు. మానవతా దృక్పధంతో ఉద్యోగం కొనసాగించాలని అఖిలపక్ష కార్మిక సంఘం నాయకులు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. జీఎం జక్కం రమేష్ సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈశ్వరరావు, బి.వీరస్వామి, జాన్, రవీందర్, కుమార్, నాసర్పాష, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.