Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నివాళులర్పించిన ఎమ్మెల్యే హరిప్రియ,
సింగరేణి అధికారులు
అ తక్షణ సాయం కింద రూ.15 లక్షలు అందజేత
నవతెలంగాణ-ఇల్లందు
మంచిర్యాలలోని ఎస్ఆర్పీ 3లో బుధవారం జరిగిన బొగ్గు గని ప్రమాదంలో నలుగురు మృతి చెందగా అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జెకె కాలనీకి చెందిన గడ్డం సత్య నరసింహరాజు వ్యక్తి పార్థివదేహం స్వస్థలం ఇల్లందు జేకె కాలనీకి గురువారం తీసుకువచ్చారు. ఎమ్మెల్యే హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్, డీజీఎం పర్సనల్ జీవి.మోహనరావు, శ్రీరాంపూర్ వెల్ ఫేర్ ఆఫీసర్ శాంతన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ డి.రాజేందర్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాథ్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ ఐఏఎస్ ఆదేశానుసారం ప్రకటించిన మ్యాచింగ్ గ్రాంట్, ప్రత్యేక ఎక్స్ గ్రేషియా, గ్యాడ్యూటీ తదితర చెల్లింపులకు రూ.60.69 లక్షలు మంజూరు కాగా తక్షణ సహాయం కింద రూ.15 లక్షల చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా యాజమాన్యము నుండి డీజీఎం పర్సనల్ జీవి.మోహనరావు, శ్రీరాంపూర్ వెల్ ఫేర్ ఆఫీసర్ శాంతన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ సంఘటన దురదృష్టకరమన్నారు. ఉద్యోగి లోటును పూడ్చలేమని ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కుటుంబానికి తగిన మనోస్థైర్యాన్ని ప్రసాదించమని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
జడ్పీ చైర్మన్ నివాళ్లు
గడ్డం సత్య నరసింహ రాజు మృతదేహానికి జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాము మహేష్, తెరాసా నాయకులు సాంభమూర్తి, సూర్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.