Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఇటీవల ఖమ్మంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులను ప్రకటించారు. ఇందులో ఇల్లందుకు చెందిన కాళంగి హరికృష్ణను రాష్ట్ర కామిటీ సభ్యులు ఎన్నుకున్నారు. గతంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. యువతను, నిరుద్యోగులను సమీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తూ చైతన్యవంతం చేస్తామన్నారు.