Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్న వికలాంగుల విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు, 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు అందించనున్నట్టు జిల్లా విద్యాధికారి ఇ.సోమశేఖర శర్మ తెలిపారు. స్కాలర్ షిప్‌కు దరఖాస్తు చేసుకొనుటకు ఫోటో, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, సదరం సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆహార భద్రతా కార్డులను కలిగి ఉండాలని, బ్యాంకు అకౌంట్ వివరాలుతో జాతీయ స్కాలర్ షిప్ పోర్టల్ నందు నమోదు చేసి, రిజిస్ట్రేషన్ తర్వాత డాకుమెంట్స్‌ను అప్లోడ్ చేసుకోవాలని వివరించారు. సంబంధిత స్కాలర్ షిప్ దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ అయినందున, వెంటనే ప్రధానోపాధ్యాయులు తగు చర్యలు తీసుకోని, విద్యార్థులచే దరఖాస్తు చేయించాలన్నారు.