Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా
అ ఘనంగా జయంతి వేడుకలు
నవతెలంగాణ-పాల్వంచ
ముస్లిం స్వాతంత్య్ర సమరయోధులు అయిన 'మౌలానా అబుల్ కలాం ఆజాద్' అసమాన విద్యావేత్తతో పాటు గొప్ప పరిపాలకుడని మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా అన్నారు. గురువారం ఆయన 133వ జయంతిని పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా బూడిదగడ్డలో గల ఆయేషా నిస్వాన్ బాలి కల మదర్సలోని పేద ముస్లిం బాలికలకు దుప్పట్లు, స్వీట్లు పంచి పెట్టారు. అలాగే మదర్స నిర్వాహకులను సంస్థ తరుఫున శాలవతో సన్మానించి జ్ఞాపికల ను అందజేశారు. ఈ సందర్భంగా యాకూబ్ పాషా మాట్లాడుతూ.. స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ, నెహ్రూలతో చురుగ్గా మౌలానా అబుల్ కలాం పాల్గొన్నారని, అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఆయన నిష్ఠానితు లని పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా 1947లో నియమితులైనారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్స నిర్వాహ కులు మౌలాన మొహమ్మద్ ఇనాయతుల్లాఖాన్, ఆయేషా బేగం, మైనార్టీ జిల్లా నాయకులు హుస్సేన్ ఖాన్, షకీల్, ఆసిఫ్, ఇర్ఫాన్ ఖాన్ పాల్గొన్నారు.