Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని గొందిగూడెం గ్రామంలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలను గురువారం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రూ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తరగతి గదులు, లైబ్రరీ, వంటగది, డైనింగ్ హాలు, ఆటస్థలం, భోజన పదార్ధాలను పరిశీలించారు. అనంతరం ఆయన ఉపాధ్యాయిలతో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలన్నారు. పిల్లలు ఎక్కువగా డ్రాప్ ఔట్స్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనతో పాటు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, ఏటీడీఓ పునెం నర్సింహారావు, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, మండల విద్యాధికారి వీరస్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లోడిగ రామారావు, ఉపాధ్యాయులు గుగులోత్ వీరస్వామి, చీమల అచ్చయ్య, వార్డెన్ ఎం.తారసింగ్, ఎన్సిసి అధికారి బి.తారచంద్ తదితరులు పాల్గొన్నారు.