Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు పనిచేసి పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ఏజెన్సీ మణిరత్నాలు, మాజీ ఎమ్మెల్యేలు కుంజా బొజ్జి, సున్నం రాజయ్యలు అని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ అన్నారు. గురువారం భద్రాచలంలో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్థూపాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సభలో బృందాకరత్ మాట్లాడుతూ మార్కిస్టు పార్టీ ముద్దుబిడ్డలు వారని అన్నారు. కుంజా బొజ్జి, సున్నం రాజయ్యలు చూపిన ఆశయ సాధన కోసం అందరూ పయనించినప్పుడే వారికి నిజమైన నివాళి అని ఆమె అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ, ఉద్యమాల నిర్మించు కుంటూ పార్టీ పురోభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఎర్రజెండా అన్ని వర్గాల ప్రజల కోసమేనని అన్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేసే సమయంలో కుంజా బొజ్జి, సున్నం రాజయ్యలు సాదా సీదా జీవితం గడుపుతూ ఆదర్శ మార్గంలో నడిచారని ఆమె అన్నారు. దేశంలో, రాష్ట్రంలో పాలక వర్గ పార్టీలు ప్రజా మద్దతుతో గెలిచిన ప్రజాప్రతినిధులను నోట్లతో కొనుగోలు చేస్తున్నారని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాప్రతి నిధులను వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. దేశంలో 49 పార్లమెంటు ఎస్టీ స్థానాలలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ స్థానాలు గెలుపొందిన ప్రజా ప్రతినిధులు షెడ్యూల్ తెగల సమస్యల కోసం పార్లమెంటులో మాట్లాడక పోవడం శోచనీయం అన్నారు. గిరిజనులకు వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నప్పటికీ గిరిజన ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం అత్యంత దారుణమని అన్నారు. పోడు రైతుల తరపున కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఆందోళన ఉద్యమాలు చేపడుతున్నామని అన్నారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ, అడవి నుంచి ఆదివాసులను దూరం చేయాలనే మహా కుట్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోపుతున్నారని ఆమె అన్నారు. ప్రధాని మోడీ ప్రాణ స్నేహితులైన అంబానీ, ఆదానీల కోసమే పనిచేస్తూ ప్రజాసంక్షేమాన్ని మరణించా రని ఆమె విమర్శించారు. 12 నెలలుగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నా రైతుల పక్షాన సీపీఐ(ఎం) పోరాటం చేస్తుందని అన్నారు. 12 నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రధాని మో డీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ప్రజల కోసం పని చేసేది సీపీఐ(ఎం) మాత్రమే
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట
అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేసేది సీపీఐ(ఎం) అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. ప్రజల కోసం పని చేసిన అత్యుత్తమ ప్రజాప్రతినిధులు కుంజా బొజ్జి, సున్నం రాజయ్యలు అని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా వీరిని కొన్ని పార్టీల నాయకులూ ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ ఆశయాల కోసం తుది వరకు పనిచేసిన మహౌన్నతమైన వ్యక్తులు అని ఆయన అన్నారు. వారి వారసత్వాన్ని, పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు బత్తుల హైమావతిలు మాట్లాడారు. ఈ బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, మచ్చ వెంకటేశ్వర్లు, సూడి కృష్ణారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేస్, రాజమ హేంద్రవరం జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి అరుణ్, ములుగు జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి రవికుమార్, గుగులోతు ధర్మ, ములుగు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దబ్బగట్ల లక్ష్మయ్య, భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు కే బ్రహ్మచారి, యం.రేణుక, ఎంబీ నర్సారెడ్డి, భద్రాచలం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, వై.వి.రామారావు, యం.లీలావతి, సున్నం గంగా తదితరులు పాల్గొన్నారు.