Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి.శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ -భువనగిరి రూరల్
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికలనిబంధనలు పాటించాలని జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి.శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వివరించారు. ఈనెల 15 లోపు ఓటరు జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదలవుతుందన్నారు. 16 న నోటిఫికేషన్, 16 నుండి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26 లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుందని, డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. పోలింగ్ కేంద్రాలుగా భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, చౌటుప్పల్లోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు . ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి కిరణ్, సీపీఐ నుండి వై.అశోక్, బి ఎస్ పి పార్టీ నుండి బి.రామచంద్రయ్య, భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ అధికారులు భూపాల్ రెడ్డి, సురేష్ కుమార్, తహసీల్దార్ అశోక్ రెడ్డి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.