Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి
నవతెలంగాణ -నల్లగొండ
విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడంతో పాటు విద్యారంగంలో కావాల్సిన మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ సాధన సర్వే 2021ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీ అరబిందో పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ సాధన సర్వేసిబ్బంది శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలోని 180 ప్రాధమిక, ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల్లో శుక్ర వారం 3, 5, 8 ,10 తరగతుల విద్యార్థులకు ఉదయం 10.30 గంటలనుండి మధ్యాన్నం 12.30 గంటల వరకూ సర్వేను నిర్వహించనున్నారని దీనికోసం 180 మంది అబ్జర్వర్ లను 240 మంది ఫీల్ద్ ఇన్వెస్టిగేటర్లను నియమించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లెవల్ కోయర్డినేటర్ మర్రెడ్డి, సమగ్రశిక్ష కోయర్డినేటర్ ఆర్. రాంచందర్ ,జాతీయ సాధన సర్వే రాష్ట్ర పరిశీలకులు పాల్గొన్నారు.