Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధిర బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మధిర ఐసీడీఎస్ ఇంచార్జి సీడీపీఓ వీరభద్రమ్మ కోరారు. జాతీయ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల పరిధిలోని చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బాలల హక్కులపైన, చట్టాలపైన, పోషకాహారం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి బాలలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల కార్మికులను పనుల్లోకి పెట్టుకోవటం చట్టరీత్యా నేరం అన్నారు. అదేవిధంగా మైనర్ బాలికలకు వివాహం చేయటం కూడా చట్టరీత్యా నేరం అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుజాత అంగన్వాడి టీచర్లు విజయలక్ష్మి, ఉష ప్రధాన ఉపాధ్యాయులు శంకర రావు, కళావతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.