Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ (ఎం)ఆధ్వర్యంలో ముదిగొండలో శుక్రవారం ధర్నా నిర్వహిస్తున్నామని ఆపార్టీ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని,రైతులు పండిస్తున్న వరి పంటను ప్రభుత్వము కొనుగోలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళన,కార్యక్రమానికి మండలంలోని పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.