Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎంపీ పొంగులేటి
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు.. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 12 వ తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రైతన్నలు అధిక సంఖ్యలో పాల్గొని వియజవంతం చెయ్యాలని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపడుతున్న ధర్నా కార్యక్రమాల్లో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని మరొక్కసారి తెలంగాణ సత్తా ఢిల్లీకి తెలియజేయాలని మాజీ ఎంపీ పొంగులేటి విజ్ఞప్తి చేసారు.
ఖమ్మం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్ వద్ద శక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా రైతులు, టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కలసి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కావున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయ వంతం చేయవల్సిందిగా క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటలో తెలిపారు.