Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సంక్రాంతిలోగా ప్రారంభిస్తా
అ డిసెంబరులోగా పెండింగ్ పింఛన్లు
అ సత్తుపల్లి ఎమ్మెల్యే
సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
వచ్చే సంక్రాంతిలోగా సొంత స్థలాల్లో ఇండ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. గతంలో ఇంత పెద్ద మొత్తాలో వేలాది మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం అందిన దాఖలాలు లేవన్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగేవి కాదన్నారు. పలు రకాల ఉద్యోగులకు జీతాలు పెంచిన ఉదంతాలు కానరావన్నారు. రైతులకు ఎకరానికి రూ. 10వేలు సాయమందించిన ప్రభుత్వాలను చూడలేదన్నారు. రూ. 50వేలకు ఉన్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని రూ. 1.00.116 పెంచడం జరిగిందన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకే అమలైన ఈ పథకం కులమతాలకు అతీతంగా పేదరికమే గీటురాయి అర్హులైన వారికి అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఏ పథకాన్ని అమలు చేయాలన్నా అందులో మానవత్వం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. రానున్న రోజుల్లో దళితబంధు పథకం కూడా అన్ని వర్గాలకు అందుతుందన్నారు. అర్హత ఉన్న అనేక మందికి పింఛన్లు ఆగాయన్నారు. అవికూడా ఈ డిసెంబరు నాటికి అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. అనంతరం నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 94 మంది లబ్ధిదారులకు రూ. 36.96 లక్షల విలువగల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, వైస్ ఛైర్మెన్ సుజలారాణి, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్కే రఫీ, నాయకులు దొడ్డా శంకరరావు, వనమా వాసుదేవరావు, వేములపల్లి మధు, అంకమరాజు, నరసింహారావు, గఫార్, కౌన్సిలర్లు చాంద్‌పాషా, మట్టా ప్రసాద్, పద్మజ్యోతి విజయనిర్మల, భవాని, వీరపనేని రాధిక పాల్గొన్నారు.