Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బయ్య అభిమన్యు
నవతెలంగాణ-ఇల్లందు
నోటిఫికేషన్లు వేయకుండా జాబ్ మేళా పేరుతో నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చూస్తోం దని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బయ్య అభిమన్యు విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవ డంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నా రని అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీక రణ చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని తెలిపారు. కొంతమంది తమ వ్యక్తిగత లాభాల కోసం ప్రైవేట్ జాబ్ మేళా జాతరను తీసుకొచ్చి నిరుద్యోగులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఉద్యోగ భద్రత లేని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు ఏ విధంగా నిరుద్యోగు లను పంపిస్తున్నారని అన్నారు. తక్షణమే ప్రైవేట్ జాబ్ మేళను ఆపి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తోందన్నారు. లేనిప క్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.