Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నివాళ్లర్పించిన సీపీఐ(ఎం), ఎన్డీ నేతలు
నవతెలంగాణ-కారేపల్లి
మాధారం డోలమైట్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటనం శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండలం మాధారంకు చెందిన తుమ్మలపల్లి చంద్రయ్య(57) మాధారం డోలమైట్మైన్స్లో టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. వ్యవసాయ పనుల కోసం తన వరి పోలానికి మోటర్ సైకిల్‌పై వెళ్ళుతుండగా మోటర్ సైకిల్ అదుపుతప్పి క్రిందపడిపోయాడు. దీంతో చంద్రయ్య తలకు తీవ్రగాయమైంది. అతనిని ఖమ్మం అసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా గుండెపోటు రావటంతో మృతి చెందాడు. దీనికి సంబంధించి మృతుని కుమారుడు తుమ్మలపల్లి హన్మంతరావు కారేపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.
వివిధ పార్టీల నేతల నివాళ్లు
మృతు చెందిన డోలమైట్ ఉద్యోగి తుమ్మలపల్లి చంద్రయ్య మృతదేహాన్ని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు(డీవీ), సర్పంచ్ అజ్మీర నరేష్, ఉపసర్పంచ్ భాగం వెంకటప్పారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్, ఆవునూరి మధు, వై.ప్రకాష్, కోయల శ్రీనివాసరావు, జానకీ, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, పోటు కళావతి, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కే.నాగేశ్వరరావు, కే.నరేంద్ర, తలారి దేవప్రకాశ్, సీఐటీయు నాయకులు జీ.నర్సింహరావు, గుర్రం వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకులు కొల్లి వీరయ్య, వీరునాయక్, గుర్రం ప్రభాకర్ లు నివాళ్లు ఆర్పించారు.