Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు భూములకు దరఖాస్తులు చేసుకునే ప్రతి రైతు అవగాహన పెంచుకుని దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓ, చుంచుపల్లి ప్రత్యేక అధికారిణి మెరుగు విద్యాలత అన్నారు. శుక్రవారం ఫ్రైడే-డ్రైడే సందర్బంగా చుంచుపల్లి మండలంలోని అంబేద్కర్ నగర్, పెనగడప, మూల్కగూడెం, ధనబాద్ గ్రామ పంచాయతీలలో పర్యటించినారు. పోడు భూములు దరఖాస్తు స్వీకరించు గ్రామాలను, హాబిటేషన్లను సందర్శించి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. తదుపరి ఉపాధి హామీ పథకము ద్వారా ఉపాధి కూలీల ద్వారా జరుగుచున్న ఎర్ర చెరువు పూడిక తీత పనులు పరిశీలించినారు. ప్లాంట్ కేర్లో భాగముగా మొక్కలుకు నీరు పోయడము, పాదులు తీయడము, ట్రీ గార్డ్స్ సరి చేయడము మొదలగు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు గ్రామ సభల వద్ద అమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి ఎంపీడీఓ సకినాల రమేష్, ఎంపీవో గుంటి సత్యనారాయణ, సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, ఇజీఎస్ ఈసీ పిల్లి నాగరాజు, టిఏ ఆస్మా, అనిల్ కుమార్లు పాల్గొన్నారు.