Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీతాలు, బిల్లులను చెల్లించాలి
అ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు
నవతెలంగాణ-మణుగూరు
మధ్యాహ్న భోజన కార్మికుల 3 నెలల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ కార్యాలయంలో విజయ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన స్కీం నుండి తప్పుకోవాలని చూస్తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా, 3 నెలలు గడుస్తున్నా బిల్లులు ఇవ్వకుండా కార్మికులు ఎలా జీవించాలని అన్నారు. కనీసవేతనం రూ.19,000 ఇచ్చి, కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్యేక పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు బండిరాజేష్, విజయ, అరుణ, చంద్రమ్మ, శాంతి, నాగమ్మ, నాగరత్నం, రమణ, సమ్మక్క, సరిత, పద్మ, లలిత, సుధ, జయమ్మ, నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.