Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ నియామకం
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది దంతాల ఆనంద్‌ను లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమిస్తూ తెలంగాణ ప్రభు త్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ద్వారా పేద ప్రజలకు న్యాయ సలహాలు అందించడానికి వీలుం టుంది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారు, అదే విధంగా ఆర్థిక స్తోమత లేక న్యాయవాదిని పెట్టుకో లేని పరిస్థితుల్లో ప్రభుత్వం నియమించిన ఆనంద్ వద్దకు వస్తే అట్టి వారికి ఉచితంగా న్యాయం అందించి, వారి కేసులను సత్వర మే పరిష్కారానికి కృషి చేస్తారు. లీగల్ అథారిటీ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఆనం ద్ పదవీకాలం మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు, అనేక స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆనంద్ తన న్యాయవాద వృత్తిని యధావిధిగా కొనసాగిస్తూ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ద్వారా సత్వర న్యాయం అందించడానికి ముందుకు వచ్చినందుకు పలువురు పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆనంద్ తండ్రిగారైన దంతాల బిక్షపతి సింగరేణి కాలరీస్ కంపెనీలో ఫస్ట్ క్లాస్ కాంట్రాక్టర్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్‌గా కూడా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించారు. ఆనంద్ నియామకం పట్ల పట్టణంలోని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.