Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, వాలంటీర్స్లను
సన్మానించిన బృందా కారత్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలో బండారు చంద్రరావు ట్రస్ట్ (బీసీఆర్) ఆధ్వర్యంలో 72 రోజుల పాటు ఐసోలేషన్ కేంద్రం నిర్వహణ, పనిచేసిన డాక్టర్స్ పాత్ర, నర్సింగ్ స్టాఫ్ పాత్ర అమోఘమైనదని, వీరి సేవలు మాటల కందని గొప్ప సేవలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సబ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ అన్నారు. భద్రాచలంలో టూరిజం హౌటల్లో కరోనా వారియర్స్ అభినందన సభ గురువారం రాత్రి నిర్వహించారు. బీసీఆర్ ట్రస్ట్ తరఫున డాక్టర్ పవన్ కుమార్, రామకృష్ణ, క్రాపా విజరు, చైతన్య, సునీల్‌తో పాటు నర్సింగ్ స్టాఫ్ సుజాత, సింధు, నాగమణి, సౌజన్య, సతీష్, రాము తదితరులను బృందా కారత్, మాజీ ఎంపీ మిడియం బాబురావులు సన్మానించారు. శాలువాలు కప్పి, మెమెంటో, ప్రశంసా పత్రాలను అందజేశారు. 72 రోజులు పాటు వాలంటీర్లుగా పని చేసిన 65 మందికి మెమెంటో, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బత్తుల హైమావతి, బండారు రవి కుమార్, ట్రస్ట్ కన్వీనర్ ఏ.జె.రమేష్, ట్రస్ట్ నిర్వాహకులు కె.బ్రహ్మ చారి, మర్లపాటి రేణుక, యం.బి.నర్సారెడ్డి, భీమవరపు వెంకట రెడ్డి, బండారు శరత్ బాబు, సంతోష్, లీలావతి, సున్నం గంగ, రత్నం, కుసుమ, జ్యోతి, డి.లక్ష్మి,మాధవ్, కుంజ శ్రీను, నాగరాజు, లక్ష్మణ్, కోరాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.