Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలోని 182 పాఠశాలలలో శుక్రవారం జాతీయ సాధన సర్వే పరీక్ష విజయవంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ తెలిపారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ సాధన సర్వే పరీక్షలో మన జిల్లాలోని ఎన్నికైన 182 పాఠశాలలకు గాను 178 పాఠశాలలలో 3,5,8,10 తరగతుల పిల్లలకు ఈ పరీక్ష నిర్వహించారు. మొత్త 5452 మంది విద్యార్థులకు గాను 5208 (95.5 శాతం) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు జిల్లాలోని సీబీఎస్ఈ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మొత్తం 212 మంది పరిశీలకులుగాను, జిల్లాలోని బీఈడీ కళాశాలల విద్యార్థులు మొత్తం 321 మంది ఫీల్డ్ ఇన్విస్టిగేటర్లుగాను నియమించబడ్డారు. జిల్లా విద్యాశాఖాధికారి ఇల్లందు మండలంలోని కొన్ని పాఠశాలలను, జిల్లా అకడమిక్ కో-ఆర్డినేటర్ నాగరాజ శేఖర్ కొత్తగూడెం, లక్ష్మి దేవిపల్లి, చుంచుపల్లి మండలాలలోని కొన్ని పాఠశాలలను, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి సైదులు పాల్వంచ, ములకలపల్లి మండలాలలోని పాఠశాలలను, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి మాధవరావు భద్రాచలంలోని పాఠశాలలను సందర్శించి అక్కడి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ పరీక్ష ఫలితాలు జిల్లా రిపోర్టు కార్డు రూపంలో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ త్వరలో విడుదల చేయనున్నదని, దీని ఆధారంగా విద్యా వ్యవస్థలో ప్రణాళికలు రచిస్తారని డీఈఓ. తెలిపారు.
ఇల్లందు బాలికోన్నత పాఠశాల, చల్లసముద్రం ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ శుక్రవారం సందర్శించారు. జాతీయ సాధన పరీక్ష నిర్వహణను తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. దేశవ్యాప్తంగా కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థుల సామర్థ్యాలను తెలిసుకొనుటకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బయటనుండి సిబ్బందిని నియమించి పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 182 పాఠశాలల్లో 3,5,8, 10 వతరగతి విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించామని తెలిపారు. పిల్లల సామర్థ్యాలను తెలుసుకొని తగు విధంగా బోధన చేయుటకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు.