Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
దివంగత విశ్రాంతి ఉపాధ్యాయులు తోటమల్ల వెంకట మాస్టార్ కుటుంభ సభ్యులను ఉభయ ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ శుక్రవారం పరామర్శించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్సీ బాలసాని మాట్లాడుతూ ఏజెన్సీలో తోటమల్ల వెంకట మాస్టార్ చేసిన సేవలను గుర్తుచేశారు. తమ సొంత మండలం వెంకటాపురం ఆలు బాకలో 20 ఏళ్లుగా.. ఒకే పాఠశాలలో పని చేసి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దా లని పేర్కొన్నారు. వెంకట మాస్టారు కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ బాలసాని ఈ సందర్భంగా ఓదార్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, టీఆర్ఎస్ భద్రాచలం మండల అధ్యక్షులు ఆరికెల తిరుపతిరావు, వెంకట మాస్టర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.