Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అఖిల భారత వ్యకాస ప్రధాన కార్యదర్శి
బి.వెంకట్
నవతెలంగాణ-అశ్వాపురం
సీతమ్మ సాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అమ్మ గారి పల్లి గ్రామంలో భూనిర్వాసితుల దీక్ష శిభిరాన్ని సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భూ నిర్వాసితులు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఎకరానికి రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం రైతులు ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గత కొంతకాలంగా రైతులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించు కోక పోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతుల న్యాయమైన కోరికలు తీర్చాలన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవ రపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి పాయం నరసింహా రావు, రైతు సంఘం మండల కార్యదర్శి మండెపూడి సాంబశివరావు, సీపీఐ(ఎం) మండల నాయకులు బీరం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.