Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రం వెంటనే కొనుగోలు చేయాలని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన భద్రాచలంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలో రైతులు పండించిన వడ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు న్యాయం చేస్తూ, తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ మహా యజ్ఞంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కింద రూ.కోటి 50 లక్షల టన్నుల వరి పంట పండుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరిగితే అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన ప్రధాని మోడీ ఆ హామీలు నేటికీ అమలు చేయకపోవటం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. మోడీ ప్రాణ స్నేహితులు అయిన అంబానీ, అదానీలకు అనుగుణంగానే చట్టాల్లో మార్పులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, బీహెచ్సీఎల్ తదితర సంస్థలను ప్రైవేటు పరంగా దారాదత్తం చేసేందుకు మోడీ పథకం రచించారని ఆయన అన్నారు. రాష్ట్రాల విభజన జరిగిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ఐదు గ్రామపంచాయతీలు, ఆంధ్రలో విలీనం అయ్యాయని, ఆ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణాలో కలపాలని ఆయన అన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ 12 నెలల పాటు ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలపై కేంద్రం ఇంతవరకూ పరిష్కార మార్గం చూపకపోవడం అత్యంత దారుణమని ఆయన అన్నారు. తొలుత భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబండిపై ప్రదర్శన నిర్వహించారు. ఈ రైతు మహాధర్నాలో టీఆర్ఎస్ ఉద్యమ నాయకులు తిప్పన సిద్ధులు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, నర్రా రాము, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోటగిరి ప్రభోద్ కుమార్, సోషల్ మీడియా డివిజన్ అధ్యక్షులు కేజే ప్రేమ్ కుమార్, అధికార ప్రతినిథి రాంబాబు, సంయుక్త కార్యదర్శి రాజీవ్, నాయకులు నవాబ్, పుల్లారావు, బషీర్, రవికుమార్, మహిళా విభాగం నాయకులు భారతి, మదార్, పద్మప్రియ, కమల, ఎండీ ముంతాజ్, ఐదు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, టీఆర ్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : తెలంగాణ రైతు బిడ్డలకు అన్యాయం చేస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని, బీజేపీ ప్రభుత్వానికి చుక్కలు చూపేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధం కావాలని, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం తప్పదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల తడాఖా అంటే ఏంటో బీజేపీకి చూపిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు ఈ భారీ మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వ భే షరతుగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలిని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వల శ్రీనివాస రావు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కీలారు నాగేశ్వర రావు, మున్సిపల్ ఛైర్పర్సన్ కాపు సీత లక్ష్మి, జెడ్పీటీసీ బరపాటి వాసు, ఎంపీపీలు బాధవత్ శాంతి, భూక్యా విజయ లక్ష్మి, భూక్యా సోన, మడివి సరస్వతి, కొత్తగూడం మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్యా రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, టీబిజీకేఎస్ నాయ కులు, గ్రామ, పట్టణ, మండల కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.