Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, విధుల నుండి తొలగించాలి
అ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో గిరిజన యువకుడు గూగులోత్ వీరశేఖర్ను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి కొత్తగూడెం పోస్టాఫీస్ అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కండ్లకు గంతలు కట్టుకొని, చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. వారికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, భవిష్యత్లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ గంధం మల్లికార్జునరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ గుడివాడ రాజేందర్, చెనిగారపు నిరంజన్ కుమార్, ఆముదాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.